శరన్నవరాత్రుల్లో భాగంగా మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో చక్రీ భజన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు నిరంతరం భజన కార్యక్రమం నిర్వహించడం ఈ ఆలయం యొక్క ఆనవాయితీగా చెప్పుకోవచ్చు. చక్రిభజన కార్యక్రమములో అన్ని వాడలకు చెందిన భజన పరులు రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంథని పట్టణంలోని అన్ని వాడలకు చెందిన భజన బృందాలు పాలీల వాయిదా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొమ్మిది రోజులపాటు తాళం, గానం ఆపకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక సంప్రదాయం. ప్రతి భజన మండలికి రోజు రెండు గంటలు చొప్పున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఎంతో విశిష్టత కలిగిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా భక్తుల్లో ఎంతో విశ్వాసం నెలకొంది. నియమ నిష్టలతో అమ్మవారిని దర్శించుకుని కానుకలు సమర్పిస్తే అంతా శుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Dtv updates
ఆదివారం, సెప్టెంబర్ 28, 2025
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..
సప్తవర్ణ శోభితం
- 1. శనివారం... సాహితీ సుమాలు సాహిత్య రంగంలో ప్రముఖులు, వారి చరిత్ర, రచనలు, కవితలు,
- 2. ఆదివారం సాంస్కృతికం.. సినిమా, సంస్కృతిక రంగాల్లో లబ్ధప్రతిష్టుల గురించి వ్యాసాలు, ఇంటర్వ్యూలు
- 3. సోమవారం క్రీడా మైదానం క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వారి వివరాలు,
- 4. మంగళవారం
- 5. బుధవారం
- 6. గురువారం: ఆధ్యాత్మికం.. దేవాలయాలు, పండితులు, ప్రవచనాలు, భక్తి
- 7. శుక్రవారం.. సరస్వతీ నమస్తుభ్యం.. విద్యకు సంబంధించి ప్రముఖ కాలమిస్టుల రచనలు
విశిష్ట పోస్ట్
హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...
All time hit
-
ఆధ్యాత్మికతను సామాజిక సేవతో మేళవించిన వ్యక్తిత్వం శ్రీ సీతారామ సేవా సదన్తో సేవా ప్రస్థానం.. ...
-
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్బాబు దిక్సూచి, హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువత...
-
మంథని పట్టణంలోని పలు గణనాథులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం దర్శనం చేసుకున్నారు. 10 వ వార...
Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి