Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

ఆదివారం, సెప్టెంబర్ 28, 2025

పెద్దపల్లి: శాంతియుతంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలి

* ఏర్పాట్లు పరిశీలిస్తున్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

*సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు..*

*ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు
పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు కట్ట వద్ద సోమవారం  బతుకమ్మ వేడుకలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ ఆడే ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని, సద్దుల బతుకమ్మ పండగలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలను అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో, నిమజ్జనం చేసే ప్రాంతాల్లో స్థలాలు చదును చేయడం, లైటింగ్, ఇతర సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించాలని సూచించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే  పిలుపునిచ్చారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండుగల సందర్భంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మున్సిపల్ ఎ.ఈ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మాజీ కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026