మేడిగడ్డ బరాజ్ దెబ్బతిందని చెప్తున్నారని, కానీ పార్వతీ బరాజ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకున్నా గేట్లు ఎత్తి నీళ్లను ఎందుకు వృధా చేస్తున్నారో జవాబు చెప్పాలనీ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ప్రశ్నించారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీని గోదావరి విలాపం అనే పేరుతో స్థానిక నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బారీ వర్షాలు పడి ఎగువనుంచి బారీగా వరదనీరు చేరి గోదావరినది నిండుగా ప్రవహిస్తోందని, నీళ్లు వృధాగా పోతుంటే గోదావరి నది కన్నీరు పెట్టుకుంటుందన్నారు. ఈనాడు లక్షల క్యూసేక్కుల నీళ్లు వృధాగా ఉప్పు నీళ్లలో కలిపేస్తున్నారని, తనను ఎవరికి ఉపయోగపడకుండా చేస్తున్నారని గోదావరి మాత గోస వెల్లబోసుకుంటుందన్నారు. ఆనాడు ప్రకృతికి విరుద్దంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రివర్స్ పంపింగ్ చేసి నీటిని పైకి తీసుకువస్తే శాపం తగులుతుందని అనుకున్నా కానీ నేడు నీళ్లన్ని వృధాగా పోయి సముద్రంలో కలుస్తుంటే ఆనాడు కేసీఆర్ చేసిన ఆలోచన ఎంతో గొప్పదని గోదావరి నది చెప్తోందన్నారు. నీళ్లు వృధా పోతున్నా ఆపాలనే ఆలోచన చేయకుండా ఇటు రైతులకు, ప్రజలకు ఉపయోగపడకుండా చేస్తున్నారని గోదావరినది మొరపెట్టుకుంటుందని, కళ్లున్న కాంగ్రెస్ నాయకులకు గోదావరి నది గోస కన్పించడం లేదా అని ప్రశ్నించారు.
Dtv updates
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..
సప్తవర్ణ శోభితం
- 1. శనివారం... సాహితీ సుమాలు సాహిత్య రంగంలో ప్రముఖులు, వారి చరిత్ర, రచనలు, కవితలు,
- 2. ఆదివారం సాంస్కృతికం.. సినిమా, సంస్కృతిక రంగాల్లో లబ్ధప్రతిష్టుల గురించి వ్యాసాలు, ఇంటర్వ్యూలు
- 3. సోమవారం క్రీడా మైదానం క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వారి వివరాలు,
- 4. మంగళవారం
- 5. బుధవారం
- 6. గురువారం: ఆధ్యాత్మికం.. దేవాలయాలు, పండితులు, ప్రవచనాలు, భక్తి
- 7. శుక్రవారం.. సరస్వతీ నమస్తుభ్యం.. విద్యకు సంబంధించి ప్రముఖ కాలమిస్టుల రచనలు
విశిష్ట పోస్ట్
హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...
All time hit
-
ఆధ్యాత్మికతను సామాజిక సేవతో మేళవించిన వ్యక్తిత్వం శ్రీ సీతారామ సేవా సదన్‌తో సేవా ప్రస్థానం.. ...
-
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు దిక్సూచి, హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువత...
-
మంథని పట్టణంలోని పలు గణనాథులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం దర్శనం చేసుకున్నారు. 10 వ వార...
Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి