గొల్లగూడెంలో కొలువైన బలవీర హనుమాన్
మంథని మున్సిపల్ పరిధిలోని బోయినపేట లోని శ్రీ బల వీర హనుమాన్ దేవాలయం శ్రావణ మాసంలో భక్తుల సుదర్శన తో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో ఎంతో మహిమాన్వితం కలిగిన శ్రీ బలవీర హనుమాన్ దేవాలయానికి శ్రావణమాసంలోనే నాలుగు శనివారాలు 4 మంగళవారాల్లో ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జాతరలా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. బలవీర హనుమాన్ ప్రాముఖ్యత ఎంతో ప్రాచుర్యం పొందింది. మంథని కి కిలోమీటర్ దూరంలో ఉన్న బోయిన్ పేట లో స్వయంభుగా వెలసిన ఆంజనేయ స్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా భక్తులు ఎంత విశ్వాసంతో దర్శించుకుంటారు. అనంతరం శ్రీ కాళికామాతను దర్శించుకుని భక్తులు పునీతులు అవుతారు. శ్రావణ శనివారం రోజున ఈ ఆలయంలో ఎక్కహం 24 గంటల పాటు ప్రజల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంథని ప్రాంతంలో నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ బలవీర హనుమాన్ ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి