మంథని లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ రాజనీతిజ్ఞుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశ సేవకు తనను తాను అంకితం చేసుకున్న మహానీయుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. 1984 నుంచి 1989 వరకు రాజీవ్ గాంధీ భారత దేశ ప్రధానమంత్రిగా పనిచేశారని అన్నారు. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడని, రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారన్నారు. దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత రాజీవ్ గాంధీ కే చెందుతుందని అన్నారు. రాజీవ్ గాంధీ విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడని, శ్రీలంక, సోవియట్ యూనియన్ తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశారని అన్నారు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారని, రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, సోషల్ మీడియా పెద్దపల్లి జిల్లాఇంచార్జి అరెల్లి కిరణ్ గౌడ్, నాయకులు బూడిద శంకర్, ఎరుకల ప్రవీణ్,కాసిపేట బాపు, భీముని వెంకటస్వామి,పెరవేన లింగయ్య, రాం రాజశేఖర్, దొరగోర్ల శ్రీనివాస్, మంథని శ్రీనివాస్, మంథని రాకేష్,సుమన్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Dtv updates
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..
సప్తవర్ణ శోభితం
- 1. శనివారం... సాహితీ సుమాలు సాహిత్య రంగంలో ప్రముఖులు, వారి చరిత్ర, రచనలు, కవితలు,
- 2. ఆదివారం సాంస్కృతికం.. సినిమా, సంస్కృతిక రంగాల్లో లబ్ధప్రతిష్టుల గురించి వ్యాసాలు, ఇంటర్వ్యూలు
- 3. సోమవారం క్రీడా మైదానం క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వారి వివరాలు,
- 4. మంగళవారం
- 5. బుధవారం
- 6. గురువారం: ఆధ్యాత్మికం.. దేవాలయాలు, పండితులు, ప్రవచనాలు, భక్తి
- 7. శుక్రవారం.. సరస్వతీ నమస్తుభ్యం.. విద్యకు సంబంధించి ప్రముఖ కాలమిస్టుల రచనలు
విశిష్ట పోస్ట్
హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...
All time hit
-
ఆధ్యాత్మికతను సామాజిక సేవతో మేళవించిన వ్యక్తిత్వం శ్రీ సీతారామ సేవా సదన్తో సేవా ప్రస్థానం.. ...
-
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్బాబు దిక్సూచి, హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువత...
-
మంథని పట్టణంలోని పలు గణనాథులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం దర్శనం చేసుకున్నారు. 10 వ వార...
Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి