Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

సోమవారం, సెప్టెంబర్ 21, 2026

చికిత్స పొందుతున్న వారికి మంత్రి పరామర్శ

దిక్సూచి, కరీంనగర్:
కరీంనగర్‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరీంనగర్
అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన తడక శ్రీనివాస్, తాడిచెర్ల గ్రామానికి చెందిన చల్ల కిష్టయ్య,  ఏవన్ హాస్పిటల్ లో మంథని మండలం కాకర్లపల్లె గ్రామానికి చెందిన బూడిది గణేష్ ను, ఆదర్శ హాస్పిటల్ లో జడల నాగరాజు సతీమణి సంధ్యారాణిని  పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో  మాట్లాడి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆస్పత్రి వైద్యులను కోరారు. అలాగే ఇటీవల అస్వస్థత కు గురైన  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగినేని జగన్ మోహన్ రావు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. నేనున్నాను ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.

ఆదివారం, సెప్టెంబర్ 20, 2026

జ్ఞాపకాలను కాపాడుకుందాం.. అల్జీమర్స్‌పై అవగాహన పెంచుకుందాం

 


సెప్టెంబర్‌ 21న ప్రపంచ అల్జీమర్స్‌ దినోత్సవం

ముద్ర, హైదరాబాద్‌: 

అల్జీమర్స్‌ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 21న ప్రపంచ అల్జీమర్స్‌ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గడం, ఇటీవల జరిగిన విషయాలను మర్చిపోవడం, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి లక్షణాలు అల్జీమర్స్‌కు సంబంధించినవిగా ఉండవచ్చు.

అల్జీమర్స్‌ అనేది డిమెన్షియాలో అత్యంత సాధారణ రూపాల్లో ఒకటి. వ్యాధి ముదిరే కొద్దీ జ్ఞాపకశక్తితో పాటు ఆలోచనా సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

ప్రారంభ దశలోనే లక్షణాలను గుర్తించి వైద్యులను సంప్రదించడం ద్వారా పరిస్థితిని అంచనా వేసి తగిన చికిత్స, సంరక్షణ చర్యలు చేపట్టవచ్చు. వృద్ధుల్లో జ్ఞాపకశక్తి మార్పులను నిర్లక్ష్యం చేయకుండా కుటుంబ సభ్యులు వారికి అండగా నిలవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అల్జీమర్స్‌ బాధితుల పట్ల ప్రేమ, సహనం, గౌరవంతో వ్యవహరించడం ఎంతో అవసరం. వారి భద్రత, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అల్జీమర్స్‌ వ్యాధిపై అపోహలను తొలగించి, బాధితులు మరియు వారి కుటుంబాలకు సమాజం అండగా నిలవాలనే సందేశాన్ని ప్రపంచ అల్జీమర్స్‌ దినోత్సవం అందిస్తోంది.

చిన్నారులతో సెల్ఫీలు.. గణపతికి చందా!


వీడియో కోసం క్లిక్​ చేయండి... గణేశ్​ మండపాలను సందర్శించిన మంత్రి

గణనాథుడి సేవలో మంత్రి శ్రీధర్‌బాబు.. 

బాల గజానన మండళ్ల వద్ద ప్రత్యేకంగా గడిపిన మంత్రి

దిక్సూచి, మంథని: 

నిత్యం ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా ఉండే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదివారం గణనాథుడి సేవలో తరించారు. మంథని పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్‌ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మందాట, మహాలక్ష్మి ఆలయం సమీపం, రావుల చెరువుకట్ట, వడ్లవాడ, కన్యకాపరమేశ్వరి ఆలయం, విశ్వబ్రాహ్మణ వీధి, సుభాష్‌నగర్‌, ఉస్మాన్‌పుర, మసీదువాడ (స్వర్ణకారుల సంఘం), బోయిన్‌పేట, పాత బస్టాండ్‌, వాగుగడ్డ, హమాలీ సంఘం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్‌ మండపాలను మంత్రి సందర్శించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంథని నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

చిన్నారులతో సరదాగా..

ఈ పర్యటనలో కొన్ని మండపాల వద్ద ఏర్పాటు చేసిన **‘బాల గజానన మండలి’**లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు స్వయంగా ఏర్పాటు చేసుకున్న గణేశ్‌ మండపాలను మంత్రి శ్రీధర్‌బాబు ఆసక్తిగా సందర్శించారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించడమే కాకుండా వారితో ఫొటోలు దిగారు.

అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. మంత్రి ఫొటోలకు మాత్రమే పరిమితం కాకుండా.. చిన్నారులు స్వయంగా సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపగా, ఆయన ఓపికగా వారితో కలిసి ఫొటోలు దిగారు. చిన్నారుల ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ వారి గణపతి మండలికి చందా కూడా అందించారు.

వేదమంత్రాల మధ్య సన్మానం

వివిధ గణేశ్‌ మండపాల వద్ద అర్చకులు వేదమంత్రాలతో మంత్రిని ఆశీర్వదించారు. మండపాల కమిటీ సభ్యులు శాలువాలతో శ్రీధర్‌బాబును సన్మానించారు. గణపతి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహించుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. 

మండపాల సందర్శనలో చిన్నారులతో మంత్రి కలిసిపోయిన తీరు స్థానికంగా ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి.. గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా చిన్నారులతో కొంతసేపు సరదాగా గడపడం పలువురిని ఆకర్షించింది.
































లోక కళ్యాణం కోసం గణపతి హవనం

గణపతి హోమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
దిక్సూచి, మంథని:
మంథని లోని రావుల చెరువుకట్ట హనుమాన్ ఆలయంలో గణనాథుని వద్ద నిర్వహించిన గణపతి హోమంలో  రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథని నియోజకవర్గ ప్రజలందరీకి, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల వాసులందరికీ, రాష్ట్ర ప్రజలందరీ  సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, వారికి  విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని , అనుకున్న పనులన్నీ సజావుగా జరిగేలా ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజా సంకల్పంతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకెళ్తూ ముందుకు నడిపిస్తున్నామన్నారు. ఈరోజు సంక్షేమంతో పాటు అభివృద్ధిని ఈ ప్రయత్న భాగంలోనే ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా  స్థిర నివాసం ఏర్పరచుకున్న వారందరికీ పట్టాలను  కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర్ రెడ్డి చాలామందికి రేగులరైజేషన్ చేయడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా మా ప్రాంతం గోదావరిఖని మంచిర్యాల, మందమర్రి, కొత్తగూడెం, ఇల్లందు లో ఇంకా మిగిలిపోయిన సింగరేణి స్థలాల సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని వెనువెంటనే వారికి పట్టా చేయాలని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. ఇంకా సింగరేణి కార్మికులకు,  గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమానికి ఎక్కడ కూడా విఘ్నం కలగకుండా ఉండాలని కోరారు. పేదవాడి ఇల్లు పూర్తి స్థాయిలో పూర్తి చేసుకునే విధంగా సొంత ఇంటి కల నెరవేర్చుకునే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందన్నారు. అదే విధంగా పేదవారి కోసం అనేక  సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని ఆ గణేశుని ఆశీస్సులు కోరుతూ లోకకల్యాణం గురించి రాష్ట్ర కల్యాణం గురించి ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ మండల కాంగ్రెస్ నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వీడియో కోసం.. కింది లింక్ క్లిక్ చేయండి

శుక్రవారం, సెప్టెంబర్ 18, 2026

కారు డ్రైవర్ నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు..

మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శి అరెల్లి కిరణ్ గౌడ్
 హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వయంగా అరెల్లి కిరణ్ గౌడ్ కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శి గా నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు.
అనంతరం కిరణ్ మాట్లాడుతూ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న తనను కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానించి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి ఆ తరువాత ఈరోజు తనపై నమ్మకంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శిగా అవకాశం కల్పించి  ఇచ్చినందుకు మంత్రి శ్రీధర్ బాబుకు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి

* గత పుష్కరాల్లో తలెత్తిన సవాళ్లు ఈసారి పునరావృతం కావొద్దు
* ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుని సమష్టిగా ఏర్పాట్లు చేయండి

* గోదావరి పుష్కరాలు-2027" కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు

దిక్సూచి, హైదరాబాద్:
కుంభమేళా తరహాలోనే రాబోయే గోదావరి పుష్కరాలను నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, అందుకు అనుగుణంగా వచ్చే ఏప్రిల్ నాటికి పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకుని సమష్టిగా ముందుకెళ్లాలని అధికారులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు*. 
గత పుష్కరాల్లో తలెత్తిన సవాళ్లు ఈసారి పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని వారికి దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం ఆయన అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిర్వహించిన "గోదావరి పుష్కరాలు - 2027" కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా... గోదావరి పుష్కరాల సన్నద్ధత, ప్రముఖ దేవాలయాల వద్ద అభివృద్ధి పనులు, ఘాట్ల నిర్మాణం, రవాణా, మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్ల పురోగతిపై సమీక్షించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పుష్కర ఏర్పాట్లలో సమన్వయ లోపం తలెత్తకుండా జిల్లాలవారీగా ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. రద్దీ అధికంగా ఉండే టైర్-1 ప్రాంతాల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన అదనపు ఏర్పాట్లపై ఘాట్ల వారీగా ప్రత్యేకంగా కలెక్టర్లతో క్షేత్రస్థాయి అధ్యయనం చేయించామన్నారు. పుష్కరాలు మొదలయ్యే నాటికి పూర్తయ్యే అవకాశమున్న పనులకే తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. చివరి వరకూ వేచి చూడకుండా గ్రౌండ్ రియాల్టీకి అనుగుణంగా ప్రతి పనికి ఒక నిర్దేశిత గడువును విధించుకోవాలని ఆదేశించారు. ఆయా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఇంటిగ్రేటెడ్ డ్యాష్‌బోర్డ్‌ను వెంటనే అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. ఇంజినీర్ల కొరత తలెత్తకుండా ఆర్‌అండ్‌బీ, ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలన్నారు. పుష్కరాల సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని చెప్పారు. భద్రాచలం వద్ద ఎస్‌టీపీ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఎన్ని నిధులనైనా కేటాయించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని, పుష్కర ఏర్పాట్లు, పనుల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని తేల్చి చెప్పారు.

గురువారం, సెప్టెంబర్ 17, 2026

గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు


మంథని పట్టణంలోని పలు గణనాథులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల  శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం దర్శనం చేసుకున్నారు. 
 10 వ వార్డులోని గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం విశ్వకర్మ జయంతి సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెడ్డి సంఘంలో బ్యాంకాట్ హాల్లో ఏర్పాటు చేసిన గణనాథుని, ఓంకారేశ్వర దేవాలయం (మహాబల యూత్), గజానన సంస్థ (మందాట), పోచమ్మవాడ లోని రైతు కార్మిక,నడివిధి గజానన సమస్త,రైతు గజానన మండలి, రావుల చెరువు కట్ట లోని మంథని క రాజా యూత్, హిందూసేన, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుని, లక్ష్మీనారాయణ గుడి విధిలోని త్రిశూల్ యూత్, గరుడ యూత్, రాణి రుద్రమదేవి టీం,రాజీవ్ నగర్ లోని గణనాథుణ్ణి,ధార్మిక్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్,ముత్యాలమ్మవాడ గణనాథుణ్ణి, అంబేద్కర్ నగర్ లో భీం రావ్ యూత్,అంబేద్కర్ నగర్ యూత్,గాంధీ చౌక్ గణేష్ ఉత్సవ సమితి, పెంజరుకట్టలోని సార్వజనిక్ గజానన మండల్,బామ్ భోలేనాథ్ యూత్ గణనాధులను దర్శించుకున్నారు.

*మంత్రి శ్రీధర్ బాబు గణనాధుల వద్ద ప్రత్యేక పూజలు చేసి ఈ మంథని నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని వారు కోరారు.*

*అనంతరం గణనాధుల వద్ద అర్చకులు కమిటీ సభ్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి కమిటీ సభ్యులందరూ శాలువాలతో మంత్రి శ్రీధర్ బాబు గారిని సన్మానించారు.*

 
































































































FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026