మంథని పట్టణంలోని పలు గణనాథులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం దర్శనం చేసుకున్నారు.
10 వ వార్డులోని గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం విశ్వకర్మ జయంతి సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెడ్డి సంఘంలో బ్యాంకాట్ హాల్లో ఏర్పాటు చేసిన గణనాథుని, ఓంకారేశ్వర దేవాలయం (మహాబల యూత్), గజానన సంస్థ (మందాట), పోచమ్మవాడ లోని రైతు కార్మిక,నడివిధి గజానన సమస్త,రైతు గజానన మండలి, రావుల చెరువు కట్ట లోని మంథని క రాజా యూత్, హిందూసేన, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుని, లక్ష్మీనారాయణ గుడి విధిలోని త్రిశూల్ యూత్, గరుడ యూత్, రాణి రుద్రమదేవి టీం,రాజీవ్ నగర్ లోని గణనాథుణ్ణి,ధార్మిక్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్,ముత్యాలమ్మవాడ గణనాథుణ్ణి, అంబేద్కర్ నగర్ లో భీం రావ్ యూత్,అంబేద్కర్ నగర్ యూత్,గాంధీ చౌక్ గణేష్ ఉత్సవ సమితి, పెంజరుకట్టలోని సార్వజనిక్ గజానన మండల్,బామ్ భోలేనాథ్ యూత్ గణనాధులను దర్శించుకున్నారు.
*మంత్రి శ్రీధర్ బాబు గణనాధుల వద్ద ప్రత్యేక పూజలు చేసి ఈ మంథని నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని వారు కోరారు.*
*అనంతరం గణనాధుల వద్ద అర్చకులు కమిటీ సభ్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి కమిటీ సభ్యులందరూ శాలువాలతో మంత్రి శ్రీధర్ బాబు గారిని సన్మానించారు.*





























































































