Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శనివారం, సెప్టెంబర్ 06, 2025

గణేశునికి ఘనంగా వీడ్కోలు

నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న గణేష్ మహరాజ్ నిమజ్జనం వైభవోపేతంగా నిర్వహించారు. భజన పాటలు, కోలాటాలు, డ్యాన్సులతో ఊరేగింపు నిర్వహించి జలాశయాల్లో నిమజ్జనం చేశారు.

వీడియో కోసం క్లిక్ చేయండి
https://youtube.com/shorts/qRzK-rtNKVU?si=L3LyhPDFJui7Ly54

గోదావరిఖనిలో..
కరీంనగర్ లో గణేష్ శోభాయాత్ర
పెద్దపల్లిలో..

కరీంనగర్ లో మంథని గణేష్ మిత్రమండలి గణేశుని శోభాయాత్ర
మంథని పెంజేరుకట్ట సర్వజన గజానన మండలి గణేశునీ శోభాయాత్ర

శుక్రవారం, సెప్టెంబర్ 05, 2025

కరీంనగర్: ఘనంగా గణపతి హోమం


కరీంనగర్ లో మంథని గణేష్ మిత్ర మండలి లో ఆదివారం  గణపతి అధర్వణ శీర్షం సహస్ర మోదక హవనం నిర్వహించారు. బ్రహ్మశ్రీ రత్నాకర్ శర్మ నేతృత్వంలో నిర్వహించిన ఈ హవనం లో గణేశునికి ప్రీతిపాత్రమైన వెయ్యి మోదకలను గణపతి  అధర్వణ శీర్షం మంత్రాలతో హోమగుండంలో హవనం చేశారు. ఋత్వికులుగా గణేష్ మండలి కార్యవర్గం, సభ్యులు సువర్ణ మురళీ కృష్ణ, చొప్పకట్ల సీతారామ్, కొల్లారపు రవికుమార్,  దహగాం శ్రీనివాస్, గంగా విలాస్ రావు, చెవిటి పూర్ణచందర్, మారుపాక ప్రసాద్, శ్యామ్, సువర్ణ శ్రీకాంత్, శ్రీరాంభట్ల సాయిచరణ్ వ్యవహరించారు. 

వీడియో..



బుధవారం, సెప్టెంబర్ 03, 2025

కాటారం: గణపతికి శ్రీను బాబు ప్రత్యేక పూజలు

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన గణేశుని మండపం వద్ద టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంత సుఖశాంతోషలతో  ఆయురారోగ్యాలతో జీవించాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్టు శ్రీనుబాబు తెలిపారు.



మంథని: భజన కార్యక్రమాలతో మారుమోగుతున్న మండపాలు

 

కరీంనగర్ లో మంథని గణేష్ మిత్ర మండలి లో భజన కార్యక్రమంలో భక్తులు

ఆధ్యాత్మిక కేంద్రమైన మంథనిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ మండపాలు భజన కార్యక్రమాలతో మారుమోగిపోతున్నాయి. అలాగే దేశ, విదేశాల్లో మంథని గణేష్ మిత్ర మండలి లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పెంజేరుకట్ట సర్వజన గజానన మండలిలో..

మందాట గణేశుని సన్నిధిలో..


కరీంనగర్ లో మంథని గణేష్ మిత్ర మండలిలో


కరీంనగర్: గణేశునికి దీపార్చన

 కరీంనగర్ లో మంథని గణేశునికి బుధవారం రాత్రి దీపార్చన చేశారు.



మంథని: గణనాథునికి 108 రకాల నైవేద్యాలు


గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు అయిన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంథని పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వీధిలో హనుమాన్ దేవాలయంలో నెలకొల్పిన గణనాధునికి బుధవారం 108 రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అదేవిధంగా 108 పిండి ప్రమిదలతో స్వామివారికి దీపారాధన నిర్వహించారు. అ విఘ్నేశ్వరుని కృప కటక్షాలు అందరిమీదా ఉండాలని స్వామి వారిని పూజించారు. విశ్వబ్రాహ్మణ మహిళా మణులు ఐఖ్యమత్యం చాటేలా అందరు  కలిసికట్టుగా 108 రకాల ప్రసాదాలను ఇంటి వద్ద స్వయంగా తయారు చేసుకుని ఎంతో భక్తిశ్రద్ధలతో వాటిని తీసుకువచ్చి వినాయకునికి సమర్పించారు. పూజారి మియాపురం వెంకటేశ్వర్లు స్వామివారికి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు. ఏకాదశి సందర్భంగా అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ వీధి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హైదరాబాద్: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం

*కొత్తగా 180 మందికి, రాబోయే రోజుల్లో 500 మందికి ఉపాధి*

*రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*


*తెలంగాణను ‘ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’ గా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు*. 


హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌ప్రైజ్ ప్రొక్యూర్‌మెంట్, సప్లయర్ కొలాబరేషన్ సంస్థ జాగర్ (JAGGAER) గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ‘ఒక్క టెక్నాలజీనే కాకుండా అన్ని రంగాలకు చెందిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారింది. ఈ జాబితాలో జాగర్ కూడా చేరడంతో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుంది. కొత్తగా ప్రారంభమైన ఈ జీసీసీ ద్వారా కొత్తగా 180 మందికి ఉపాధి లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 500కు చేరుతుంది’ అని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘జాగర్ ఏఐ ప్లాట్ ఫాం, ఏఐ ఆధారిత ప్రొక్యూర్‌మెంట్ పరిష్కారాల అభివృద్ధికి ఈ జీసీసీ ఒక వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తయారీ, విద్య, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్ తదితర రంగాలకు సాఫ్ట్‌వేర్, క్లౌడ్ ఆపరేషన్ సేవలను అందిస్తుంది’ అని తెలిపారు. ‘జీసీసీల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గతేడాదిలో 70 జీసీసీలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 100 జీసీసీలను కొత్తగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పారు. ‘ఏఐ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు ప్రత్యేకంగా ఏఐ సిటీని అభివృద్ధి చేయనున్నాం. ప్రపంచానికి ఏఐ నిపుణులను అందించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయబోతున్నాం’ అని చెప్పారు. కార్యక్రమంలో జాగర్ సీఈఓ ఆండ్రూ రోస్కో, చీఫ్ డిజిటల్ & ఏఐ ఆఫీసర్ – డెవలెప్ మెంట్ గోపీనాథ్ పోలవరపు, చీఫ్ కస్టమర్ ఆఫీసర్ ట్రాయ్ మేయర్ తదితరులు పాల్గొన్నారు.

మంగళవారం, సెప్టెంబర్ 02, 2025

కరీంనగర్: భక్తి పారవశ్యంలో గణేష్ మండపాలు

 


కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏకాదశి సందర్భంగా గజానన సంస్థల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి హోమాలు, విష్ణు, లలిత సహస్ర నామాలు సహస్ర మోదక హవనాలు నిర్వహించారు. మండపల వద్ద అన్న ప్రసాదం వితరణ పెద్ద ఎత్తున జరుగుతోంది.












హైదరాబాద్: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ



*బ్యాడ్మింటన్ కేవలం ఆట కాదు, జీవిత పాఠం*

*యోనెక్స్-సన్ రైజ్ 79వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ - 2025" ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు*

బ్యాడ్మింటన్ కేవలం ఒక ఆట మాత్రమే కాదని, జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పే ఉత్తమ గురువు అని

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బీఏటీ) అధ్యక్షుడు శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలోని హార్ట్‌ఫుల్‌నెస్ గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో బీఏటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యోనెక్స్ - సన్ రైజ్ 79వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ - 2025” ను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. కోర్టులో పడిన ప్రతిసారీ లేచి నిలబడే షటిల్ జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మనకు గొప్ప స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రకాష్ పదుకొనె, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, సాత్విక్, చిరాగ్, శ్రీకాంత్ వంటి దిగ్గజ క్రీడాకారులు బ్యాడ్మింటన్లో మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. అలాంటి గొప్ప క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని కేవలం పాయింట్ల కోసం మాత్రమే కాకుండా, దేశం కోసం ఆడాలని యువ క్రీడాకారులకు సూచించారు. మీ క్రమశిక్షణే అసలైన కోచ్ అని, నిరంతర పరిశ్రమే అసలైన స్పాన్సర్ అని, ఆత్మ విశ్వాసం, గెలవాలనే పట్టుదలే మీ అసలైన బలం అని వారికి మార్గ నిర్దేశం చేశారు. తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. అత్యుత్తమ క్రీడాకారులుగా ఎదిగేందుకు అవసరమైన అన్ని రకాల ప్రపంచ స్థాయి సౌకర్యాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే కె.శంకరయ్య, టీయూఎఫ్ఐడీసీ ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి, బీఏటీ ప్రధాన కార్యదర్శి, బ్యాడ్మింటన్ నేషనల్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

సోమవారం, సెప్టెంబర్ 01, 2025

మంథని: లండన్ లో వినాయక నిమజ్జనం

గణపతి నవరాత్రుల సందర్భంగా లండన్ లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థినీ,విద్యార్థులు గత ఆరు రోజులుగా గణపతిని పూజిస్తూ,పూజలు అందుకున్నారు. సోమవారం అన్న ప్రసాద వితరణ చేసి అనంతరం గణపతిని ఊరేగింపుగా నృత్యాలు పాటలు పాడుతూ తీసుకెళ్తూ అందరూ బాగుండాలని గణపతి ని వేడుకుంటూ గణపతి బప్పా మోరయ్య అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కంది అక్షయ్ రెడ్డి, త్రినాధ్, ఆకాష్, చరణ్, కావేరి, సాయి, ప్రేమ్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మంథని: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రాంపెల్లి కిష్టయ్య (99) మృతి

రాంపెల్లి కిష్టయ్య (ఫైల్)

రాంపెల్లి కిష్టయ్య మృతదేహానికి అధికారిక పూర్వక నివాళి అర్పిస్తున్న మంథని ఆర్డీవో

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రాంపెల్లి కిష్టయ్య (99) ఆదివారం స్వర్గస్తులయ్యారు. మంథనికి చెందిన ఆయన నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల్లో ఒకరు. స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో రజాకార్ల ఆగడాలను అరికట్టేందుకు ఏర్పడిన సాయుధ దళం లో సభ్యుడిగా చేరి మహారాష్ట్ర లోని సిరోంచా లో ఆయుధ శిక్షణ కూడా తీసుకున్నారు. తెలంగాణ విమోచన అనంతరం విద్యాశాఖ లో నాజర్ గా పనిచేసిన ఆయన రిటైర్డ్  అనంతరం మంథని ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. పలు సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఆయన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ స్పీకర్ శ్రీపాద రావుకు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు దగ్గరి బంధువు.  కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన ఆదివారం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని మంథనిలోని నడివీధిలో గల స్వగృహానికి తరలించారు. ఆయన మృతదేహానికి మంథని ఆర్డీవో తో పాటు అధికారులు పూలమాలలు వేసి అధికారపూర్వక నివాళి అర్పించారు. 

ఆదివారం, ఆగస్టు 31, 2025

కరీంనగర్: హోమ జ్వాల లో అద్భుతం

 

కరీంనగర్ లో మంథని గణేష్ మిత్ర మండలి లో గణపతి అధర్వణ శీర్షం సహస్ర మోదక  హవనం చేస్తున్న సమయంలో తీసిన ఫోటో..  ఈ ఫోటో జూమ్ చేసి చూడండి. హోమ జ్వాల హనుమంతుని ఆకారంలో ఉన్న గణేశుని మాదిరిగా కనిపిస్తోంది. త్యాగరాజ కీర్తన.. " శ్రీ గణనాథం భజామ్యహం" లో ఆంజనేయ అవతారం శుభాంగం.. కుంజర వరం త్యాగరాజ కీర్తనం అంటూ కీర్తించారు. ఆ రూపంలో గణేశుని దర్శనం కావడం ఆశ్చర్యానికి గురిచేసింది.

శనివారం, ఆగస్టు 30, 2025

న్యూజెర్సీ: అమెరికాలో మంథని గణపతి


 అమెరికాలోని న్యూజెర్సీలో మంథని గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంథనికి చెందిన పలువురు స్థిరనివాసం ఏర్పరచుకున్న వారందరూ కలిసి ప్రతి సంవత్సరం గణేశ్ ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించుకుంటారు.

మంథని: వైకుంఠ రథాన్ని ప్రారంభించిన మంత్రి

 మంథని మునిసిపాలిటీలో సిడిపి రూ. 48 లక్షల నిధులతో కొనుగోలు చేసిన వైకుంఠ రథం, ఫ్రీజర్ బాక్స్ ను మంథని గాంధీ చౌక్ లో  *రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు* చేతుల మీదుగా ప్రారంభించారు. మంథని మున్సిపాలిటీ ప్రజలకు.. చివరి మజిలీలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు  ఈ వైకుంఠ రథాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు.

శుక్రవారం, ఆగస్టు 29, 2025

మంథని: గణపతి హోమము నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు





మంథనిలోని రావులచెరువు కట్ట గణేశ్ మండపంలో గణపతి హోమములో  రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రభుత్వానికి శక్తిని ఇవ్వాలని గణేశుని కోరినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా దుష్టశక్తులను తరిమి వేసి ప్రభుత్వాన్ని ముందుకు నడిపే విధంగా చూడాలని భగవంతుని  ప్రార్థించామన్నారు.

రాష్ట్రంలో అనుకోకుండా భారీ వర్షాలు కురవడం వల్ల ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిందని, అదేవిధంగా పంట పొలాల్లో నీరు చేరి రైతాంగం నష్టపోయిందని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వపరంగా పరిహారం చెల్లించి ఆదుకుంటాం అన్నారు.



మంథని: గణేష్ మండపాలను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు నాయకులను

 





ఈ రోజు మంథని మున్సిపల్ పరిధిలోని విశ్వబ్రాహ్మణుల వాడ, మందాట, మర్రివాడ,  మార్కెట్ ఏరియా, మసీదు వాడ, గాంధీ చౌక్. సత్య సాయి బాబా ఏరియా,  పెంజేరు కట్ట, రెడ్డి ఫంక్షన్ హాల్, హమాలి సంఘం, మహాలక్ష్మి టెంపుల్ ఏరియా లక్ష్మీనారాయణ గుడి వీధి. ఎరుకల గూడెం, హనుమాన్ టెంపుల్ లో గణపతి మండపాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విఘ్నాలు తొలగించే వినాయకుని కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. 

శుక్రవారం మంథని పట్టణంలోని పలు మండపాలను దర్శించుకొని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మంత్రివర్యులు మాట్లాడుతూ వినాయకుని తో విఘ్నాలు తొలగి అందరూ సంతోషంగా ఉండాలని ఆయన కోరారు. ఈ పండుగను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని ఇదే సంతోషంతో నిమజ్జనం కార్యక్రమం కూడా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. 

ఈ సందర్భంగా ఉత్సవ సమితి సభ్యులు మంత్రి శ్రీధర్ బాబును శాలువాతో ఘనంగా సన్మానించారు.






గురువారం, ఆగస్టు 28, 2025

హైదరాబాద్: చికిత కు స్వాగతం



ఆర్చరీ విభాగంలో ప్రపంచ యూత్ ఛాంపియన్ గా నిలిచిన చికిత పెద్దపల్లి నివాసి అయినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది

కుమారి తానిపర్తి చికితకు నా అభినందనలు..

* పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు 

అండర్ 21 కేటగిరి ఫైనల్ లో కొరియాకు చెందిన పార్క్ యేరీన్ పై విజయం సాధించి స్వర్ణ పతకం చేజిక్కించుకున్న పెద్దపల్లి నియోజకవర్గ ముద్దుబిడ్డ ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన కుమారి. తానిపర్తి చికిత మొదటి సారిగా హైదరాబాద్ కి విచ్చేసిన సందర్బంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిడి శ్రీహరి గారు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు మరియు పలువురు ఎమ్మెల్సీ బలమురి వెంకట్ గార్లతో కలిసి ఘన స్వాగతం పలికిన తదుపరి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

గోదావరిఖని:ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించినా సీఎం రేవంత్ రెడ్డి


శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏరియల్ మార్గం ద్వారా పెద్దపల్లి జిల్లా లోని గోలి వాడ పంప్ హౌస్  వద్ద ఉన్న హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి  జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. 

అనంతరం *అంతర్గాం లోని శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్  ప్రాజెక్టు ను సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి, టి పి సి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష,రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి పరిశీలించారు.*  ప్రాజెక్టుకు వస్తున్న వరద, ప్రస్తుతం ఉన్న నీటి నిలువ, దిగువకు వదులుతున్న వరద మొదలగు వివరాలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. 

ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణ పకడ్బందిగా  ఉండాలని, వరద ముగిసే సమయానికి ప్రాజెక్టు నీటి నిల్వ  పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం సంబంధిత  ఇంజనీరింగ్ అధికారులకు  సూచించారు. 

వరద పెరిగే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు

 గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా జంక్షన్ లాగా ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని సీఎం తెలిపారు. నిపుణులు, ఇంజనీర్ల సూచనలు, సలహాలు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ , అన్నారం, సుందిల్ల ప్రాజెక్టు పునరుద్దరణ, మరమ్మత్తు అవకాశాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి వెంట ఇరిగేషన్ సి.ఈ. సుధాకర్ రెడ్డి, ఎస్.ఈ. శ్రీనివాస్ గుప్తా, అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణు, ఆర్డీవో గంగయ్య, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ఇరిగేషన్ సీ.ఈ. సుధాకర్ రెడ్డి, జిల్లా లోని ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026