గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు అయిన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంథని పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వీధిలో హనుమాన్ దేవాలయంలో నెలకొల్పిన గణనాధునికి బుధవారం 108 రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అదేవిధంగా 108 పిండి ప్రమిదలతో స్వామివారికి దీపారాధన నిర్వహించారు. అ విఘ్నేశ్వరుని కృప కటక్షాలు అందరిమీదా ఉండాలని స్వామి వారిని పూజించారు. విశ్వబ్రాహ్మణ మహిళా మణులు ఐఖ్యమత్యం చాటేలా అందరు కలిసికట్టుగా 108 రకాల ప్రసాదాలను ఇంటి వద్ద స్వయంగా తయారు చేసుకుని ఎంతో భక్తిశ్రద్ధలతో వాటిని తీసుకువచ్చి వినాయకునికి సమర్పించారు. పూజారి మియాపురం వెంకటేశ్వర్లు స్వామివారికి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు. ఏకాదశి సందర్భంగా అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ వీధి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Dtv updates
బుధవారం, సెప్టెంబర్ 03, 2025
హైదరాబాద్: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం
*కొత్తగా 180 మందికి, రాబోయే రోజుల్లో 500 మందికి ఉపాధి*
*రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*
*తెలంగాణను ‘ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’ గా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు*.
హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్ప్రైజ్ ప్రొక్యూర్మెంట్, సప్లయర్ కొలాబరేషన్ సంస్థ జాగర్ (JAGGAER) గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ‘ఒక్క టెక్నాలజీనే కాకుండా అన్ని రంగాలకు చెందిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారింది. ఈ జాబితాలో జాగర్ కూడా చేరడంతో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుంది. కొత్తగా ప్రారంభమైన ఈ జీసీసీ ద్వారా కొత్తగా 180 మందికి ఉపాధి లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 500కు చేరుతుంది’ అని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘జాగర్ ఏఐ ప్లాట్ ఫాం, ఏఐ ఆధారిత ప్రొక్యూర్మెంట్ పరిష్కారాల అభివృద్ధికి ఈ జీసీసీ ఒక వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తయారీ, విద్య, ఎఫ్ఎంసీజీ, రిటైల్ తదితర రంగాలకు సాఫ్ట్వేర్, క్లౌడ్ ఆపరేషన్ సేవలను అందిస్తుంది’ అని తెలిపారు. ‘జీసీసీల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గతేడాదిలో 70 జీసీసీలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 100 జీసీసీలను కొత్తగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పారు. ‘ఏఐ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు ప్రత్యేకంగా ఏఐ సిటీని అభివృద్ధి చేయనున్నాం. ప్రపంచానికి ఏఐ నిపుణులను అందించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయబోతున్నాం’ అని చెప్పారు. కార్యక్రమంలో జాగర్ సీఈఓ ఆండ్రూ రోస్కో, చీఫ్ డిజిటల్ & ఏఐ ఆఫీసర్ – డెవలెప్ మెంట్ గోపీనాథ్ పోలవరపు, చీఫ్ కస్టమర్ ఆఫీసర్ ట్రాయ్ మేయర్ తదితరులు పాల్గొన్నారు.
మంగళవారం, సెప్టెంబర్ 02, 2025
కరీంనగర్: భక్తి పారవశ్యంలో గణేష్ మండపాలు
కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏకాదశి సందర్భంగా గజానన సంస్థల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి హోమాలు, విష్ణు, లలిత సహస్ర నామాలు సహస్ర మోదక హవనాలు నిర్వహించారు. మండపల వద్ద అన్న ప్రసాదం వితరణ పెద్ద ఎత్తున జరుగుతోంది.
హైదరాబాద్: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ
*బ్యాడ్మింటన్ కేవలం ఆట కాదు, జీవిత పాఠం*
*యోనెక్స్-సన్ రైజ్ 79వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ - 2025" ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు*
బ్యాడ్మింటన్ కేవలం ఒక ఆట మాత్రమే కాదని, జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పే ఉత్తమ గురువు అని
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బీఏటీ) అధ్యక్షుడు శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలోని హార్ట్ఫుల్నెస్ గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో బీఏటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యోనెక్స్ - సన్ రైజ్ 79వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ - 2025” ను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. కోర్టులో పడిన ప్రతిసారీ లేచి నిలబడే షటిల్ జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మనకు గొప్ప స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రకాష్ పదుకొనె, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, సాత్విక్, చిరాగ్, శ్రీకాంత్ వంటి దిగ్గజ క్రీడాకారులు బ్యాడ్మింటన్లో మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. అలాంటి గొప్ప క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని కేవలం పాయింట్ల కోసం మాత్రమే కాకుండా, దేశం కోసం ఆడాలని యువ క్రీడాకారులకు సూచించారు. మీ క్రమశిక్షణే అసలైన కోచ్ అని, నిరంతర పరిశ్రమే అసలైన స్పాన్సర్ అని, ఆత్మ విశ్వాసం, గెలవాలనే పట్టుదలే మీ అసలైన బలం అని వారికి మార్గ నిర్దేశం చేశారు. తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. అత్యుత్తమ క్రీడాకారులుగా ఎదిగేందుకు అవసరమైన అన్ని రకాల ప్రపంచ స్థాయి సౌకర్యాలను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే కె.శంకరయ్య, టీయూఎఫ్ఐడీసీ ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి, బీఏటీ ప్రధాన కార్యదర్శి, బ్యాడ్మింటన్ నేషనల్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
సోమవారం, సెప్టెంబర్ 01, 2025
మంథని: లండన్ లో వినాయక నిమజ్జనం
గణపతి నవరాత్రుల సందర్భంగా లండన్ లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థినీ,విద్యార్థులు గత ఆరు రోజులుగా గణపతిని పూజిస్తూ,పూజలు అందుకున్నారు. సోమవారం అన్న ప్రసాద వితరణ చేసి అనంతరం గణపతిని ఊరేగింపుగా నృత్యాలు పాటలు పాడుతూ తీసుకెళ్తూ అందరూ బాగుండాలని గణపతి ని వేడుకుంటూ గణపతి బప్పా మోరయ్య అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కంది అక్షయ్ రెడ్డి, త్రినాధ్, ఆకాష్, చరణ్, కావేరి, సాయి, ప్రేమ్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
మంథని: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రాంపెల్లి కిష్టయ్య (99) మృతి
![]() |
| రాంపెల్లి కిష్టయ్య (ఫైల్) |
![]() |
| రాంపెల్లి కిష్టయ్య మృతదేహానికి అధికారిక పూర్వక నివాళి అర్పిస్తున్న మంథని ఆర్డీవో |
| ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రాంపెల్లి కిష్టయ్య (99) ఆదివారం స్వర్గస్తులయ్యారు. మంథనికి చెందిన ఆయన నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల్లో ఒకరు. స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో రజాకార్ల ఆగడాలను అరికట్టేందుకు ఏర్పడిన సాయుధ దళం లో సభ్యుడిగా చేరి మహారాష్ట్ర లోని సిరోంచా లో ఆయుధ శిక్షణ కూడా తీసుకున్నారు. తెలంగాణ విమోచన అనంతరం విద్యాశాఖ లో నాజర్ గా పనిచేసిన ఆయన రిటైర్డ్ అనంతరం మంథని ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. పలు సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఆయన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ స్పీకర్ శ్రీపాద రావుకు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు దగ్గరి బంధువు. కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన ఆదివారం హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని మంథనిలోని నడివీధిలో గల స్వగృహానికి తరలించారు. ఆయన మృతదేహానికి మంథని ఆర్డీవో తో పాటు అధికారులు పూలమాలలు వేసి అధికారపూర్వక నివాళి అర్పించారు. |
ఆదివారం, ఆగస్టు 31, 2025
కరీంనగర్: హోమ జ్వాల లో అద్భుతం
కరీంనగర్ లో మంథని గణేష్ మిత్ర మండలి లో గణపతి అధర్వణ శీర్షం సహస్ర మోదక హవనం చేస్తున్న సమయంలో తీసిన ఫోటో.. ఈ ఫోటో జూమ్ చేసి చూడండి. హోమ జ్వాల హనుమంతుని ఆకారంలో ఉన్న గణేశుని మాదిరిగా కనిపిస్తోంది. త్యాగరాజ కీర్తన.. " శ్రీ గణనాథం భజామ్యహం" లో ఆంజనేయ అవతారం శుభాంగం.. కుంజర వరం త్యాగరాజ కీర్తనం అంటూ కీర్తించారు. ఆ రూపంలో గణేశుని దర్శనం కావడం ఆశ్చర్యానికి గురిచేసింది.
శనివారం, ఆగస్టు 30, 2025
న్యూజెర్సీ: అమెరికాలో మంథని గణపతి
అమెరికాలోని న్యూజెర్సీలో మంథని గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంథనికి చెందిన పలువురు స్థిరనివాసం ఏర్పరచుకున్న వారందరూ కలిసి ప్రతి సంవత్సరం గణేశ్ ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించుకుంటారు.
మంథని: వైకుంఠ రథాన్ని ప్రారంభించిన మంత్రి
మంథని మునిసిపాలిటీలో సిడిపి రూ. 48 లక్షల నిధులతో కొనుగోలు చేసిన వైకుంఠ రథం, ఫ్రీజర్ బాక్స్ ను మంథని గాంధీ చౌక్ లో *రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు* చేతుల మీదుగా ప్రారంభించారు. మంథని మున్సిపాలిటీ ప్రజలకు.. చివరి మజిలీలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ వైకుంఠ రథాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు.
శుక్రవారం, ఆగస్టు 29, 2025
మంథని: గణపతి హోమము నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు
మంథనిలోని రావులచెరువు కట్ట గణేశ్ మండపంలో గణపతి హోమములో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రభుత్వానికి శక్తిని ఇవ్వాలని గణేశుని కోరినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా దుష్టశక్తులను తరిమి వేసి ప్రభుత్వాన్ని ముందుకు నడిపే విధంగా చూడాలని భగవంతుని ప్రార్థించామన్నారు.
రాష్ట్రంలో అనుకోకుండా భారీ వర్షాలు కురవడం వల్ల ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిందని, అదేవిధంగా పంట పొలాల్లో నీరు చేరి రైతాంగం నష్టపోయిందని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వపరంగా పరిహారం చెల్లించి ఆదుకుంటాం అన్నారు.
మంథని: గణేష్ మండపాలను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు నాయకులను
ఈ రోజు మంథని మున్సిపల్ పరిధిలోని విశ్వబ్రాహ్మణుల వాడ, మందాట, మర్రివాడ, మార్కెట్ ఏరియా, మసీదు వాడ, గాంధీ చౌక్. సత్య సాయి బాబా ఏరియా, పెంజేరు కట్ట, రెడ్డి ఫంక్షన్ హాల్, హమాలి సంఘం, మహాలక్ష్మి టెంపుల్ ఏరియా లక్ష్మీనారాయణ గుడి వీధి. ఎరుకల గూడెం, హనుమాన్ టెంపుల్ లో గణపతి మండపాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విఘ్నాలు తొలగించే వినాయకుని కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.
శుక్రవారం మంథని పట్టణంలోని పలు మండపాలను దర్శించుకొని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మంత్రివర్యులు మాట్లాడుతూ వినాయకుని తో విఘ్నాలు తొలగి అందరూ సంతోషంగా ఉండాలని ఆయన కోరారు. ఈ పండుగను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని ఇదే సంతోషంతో నిమజ్జనం కార్యక్రమం కూడా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఉత్సవ సమితి సభ్యులు మంత్రి శ్రీధర్ బాబును శాలువాతో ఘనంగా సన్మానించారు.
గురువారం, ఆగస్టు 28, 2025
హైదరాబాద్: చికిత కు స్వాగతం
ఆర్చరీ విభాగంలో ప్రపంచ యూత్ ఛాంపియన్ గా నిలిచిన చికిత పెద్దపల్లి నివాసి అయినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది
కుమారి తానిపర్తి చికితకు నా అభినందనలు..
* పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు
అండర్ 21 కేటగిరి ఫైనల్ లో కొరియాకు చెందిన పార్క్ యేరీన్ పై విజయం సాధించి స్వర్ణ పతకం చేజిక్కించుకున్న పెద్దపల్లి నియోజకవర్గ ముద్దుబిడ్డ ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన కుమారి. తానిపర్తి చికిత మొదటి సారిగా హైదరాబాద్ కి విచ్చేసిన సందర్బంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిడి శ్రీహరి గారు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు మరియు పలువురు ఎమ్మెల్సీ బలమురి వెంకట్ గార్లతో కలిసి ఘన స్వాగతం పలికిన తదుపరి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని:ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించినా సీఎం రేవంత్ రెడ్డి
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏరియల్ మార్గం ద్వారా పెద్దపల్లి జిల్లా లోని గోలి వాడ పంప్ హౌస్ వద్ద ఉన్న హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం *అంతర్గాం లోని శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు ను సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి, టి పి సి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష,రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి పరిశీలించారు.* ప్రాజెక్టుకు వస్తున్న వరద, ప్రస్తుతం ఉన్న నీటి నిలువ, దిగువకు వదులుతున్న వరద మొదలగు వివరాలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణ పకడ్బందిగా ఉండాలని, వరద ముగిసే సమయానికి ప్రాజెక్టు నీటి నిల్వ పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
వరద పెరిగే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు
గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా జంక్షన్ లాగా ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని సీఎం తెలిపారు. నిపుణులు, ఇంజనీర్ల సూచనలు, సలహాలు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ , అన్నారం, సుందిల్ల ప్రాజెక్టు పునరుద్దరణ, మరమ్మత్తు అవకాశాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వెంట ఇరిగేషన్ సి.ఈ. సుధాకర్ రెడ్డి, ఎస్.ఈ. శ్రీనివాస్ గుప్తా, అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణు, ఆర్డీవో గంగయ్య, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ఇరిగేషన్ సీ.ఈ. సుధాకర్ రెడ్డి, జిల్లా లోని ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
బుధవారం, ఆగస్టు 27, 2025
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమీషనరేట్ లో వినాయక చవితి వేడుకలు
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయం లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారు అధికారులతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకొన్నారు.
సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ... ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని, అందరు తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని, కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం, ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిస్తుందని, పోలీసు శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల వద్ద నిర్వాహకులు, యువత పోలీస్ వారి సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఇదేరీతిలో ఈరోజు నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు, నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు సీపీ గారు తెలిపారు. పూజా కార్యక్రమంలో గోదావరిఖని ఎసిపి ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, ఆర్ ఐ దామోదర్, శ్రీనివాస్, శేఖర్,మల్లేశం, సిసి హరీష్, ఆర్ఎస్ఐ లు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దపల్లి: వైభవంగా గణనాధుని పూజలు
సమూహ జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC), పెద్దపల్లి ప్రాంగణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వారి దేవాలయ కల్యాణ మండపంలో ఈ సంవత్సరం వినాయక చతుర్ధి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుటకు మన ఉద్యోగ గణనాథుడిని టి.ఎన్.జి.వో. ల ఆధ్వర్యంలో సమస్త జిల్లా ఉద్యోగుల పక్షాన టి.ఎన్.జి.వో. సంఘం - పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మరియు ఉద్యోగ, ఉపాధ్యాయుల జే.ఏ.సీ. ఛైర్మన్ , ఆలయ సంఘం ఛైర్మన్ శ్రీ బొంకూరి శంకర్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. బుధవారం మొదటి రోజు పూజకు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న దాసరి వేణు సతీ సమేతంగా విచ్చేసి పూజలో భాగస్వామ్యులు కావడం జరిగింది. వారితో పాటు టి.ఎన్.జి.వో. సంఘం - పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మరియు ఉద్యోగ, ఉపాధ్యాయుల జే.ఏ.సీ. ఛైర్మన్ , ఆలయ సంఘం ఛైర్మన్ శ్రీ బొంకూరి శంకర్ గారి దంపతులు, వారి కార్యదర్శి శ్రీ పిస్క సత్యనారాయణ గారి దంపతులు ఈ రోజు పూజలో భాగస్వామ్యులు కావడం జరిగింది. ఆలయ ఆస్థాన అర్చకులు శ్రీ రంగాచార్యులు ఈ పూజను ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో టి.ఎన్.జి.వో. ల పట్టణ అధ్యక్షులు శ్రీ అయిరెడ్డి సందీప్ రెడ్డి గారు, ఆలయ కోశాధికారి శ్రీకాంత్ గారు, సరిత , రాజ్ కుమార్, జిల్లా పంచాయితీ సెక్రటరీ సంఘం అధ్యక్షులు నుశాంత్ రావు, శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొని విజయవంతం చేసారు.
సోమవారం, ఆగస్టు 25, 2025
పెద్దపల్లి: నేత్రదానంతో వెలుగులు
నేత్రదాన పక్షోత్సవాలు కరపత్రాలు, బ్యానర్లు ఆవిష్కతీస్తున్న జిల్లా జడ్జి సునీత కుంచాల
నేత్రదానంతో మన చూపు సజీవంగా ఉంటుందని, మరో ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించడానికి నేత్రదానం మహా పుణ్యకార్యమని పెద్దపల్లి జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నేత్రదాన పక్షోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా, సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి పృధ్వీ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి, జిల్లా జడ్జి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వరకు నిర్వహించే నేత్రదాన పక్షోత్సవాల అవగాహన కల్పించే కరపత్రాలు, బ్యానర్లను జిల్లా జడ్జి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి గారు మాట్లాడుతూ... అవయవ దానంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం గొప్ప విషయమన్నారు. పెద్దపల్లి జిల్లాలో నేత్రదానంపై అవగాహన పెరుగుతోందని, ఇందుకోసం సదాశయ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. నేత్ర దానంతో చూపు సజీవంగా ఉంటుందని, మరో ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించే గొప్ప పుణ్యకార్యమని, అపోహలు, అనుమానాలు వీడి అందరూ మరణానంతరం నేత్రదానం చేయడానికి ముందుకు పిలుపునిచ్చారు. జిల్లాలోని ఓదెల, అబ్బిడిపల్లి గ్రామాల ప్రజలంతా స్వచ్చందంగా ముందుకు రావడం స్పూర్తిదాయకమని, ఈ గ్రామాలను ఆదర్శంగా తీసుకొని మరిన్ని గ్రామాలు కూడా ముందుకు రావాలని కోరారు. సదాశయ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు నేత్ర, అవయవ దానాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తీరు బాగుందని, అందరూ అవగాహన తెచ్చుకొని చనిపోయిన తరువాత నేత్రాలను దానం చేసి, మరో ఇద్దరి దేహంలో ఆ కళ్ళతో సజీవంగా ఈ లోకాన్ని చూసే అదృష్టం పొందవచ్చని, మరో ఇద్దరు అంధులకు పునర్జన్మ ఇచ్చినవారవుతన్నారు. కోర్టులో త్వరలో నేత్రదానం, రక్తదానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్థామన్నారు. తలసేమియా బాధితులను ఆదుకోవడానికి, త్వరలోనే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో distric legel service athority sectrtory శ్రీమతి swapna Rani garu, AO. p. రవీందర్ గారు , పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాదం రమేష్ గారు, court lisening officer కోటేశ్వర రావు గారు, ఫౌండేషన్ సభ్యులు భీమనపల్లి పృధ్వీ రాజ్ , శ్యాంప్రసాద్, అశోక్, మేన మహేందర్, బొడ్డుపెళ్ళి లక్ష్మణ్ పాల్గొన్నారు.
పెద్దపల్లి:పరిరక్షణకు మట్టి గణపతులను పూజిద్దాం
మట్టి గణేష్ ప్రతిమలను పంపిణీ చేస్తున్న కలెక్టర్ కోయ శ్రీ హర్ష
*మట్టి వినాయక విగ్రహా పోస్టర్ ను ఆవిష్కరించి, మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్*
పర్యావరణ పరిరక్షణ కోసం మనమంతా మట్టి గణపతులను పూజించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* ప్రజలను కోరారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో మట్టి వినాయక విగ్రహా పోస్టర్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి పై ఉందని, మట్టి వినాయకులను పూజించాలని చేసే అవగాహన కార్యక్రమంలో భాగంగా బస్ స్టాప్, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వాల్ పోస్టర్లను ప్రదర్శన చేయాలని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేస్తూ పర్యావరణం పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రంగులు ఉపయోగించి తయారు చేసిన గణపతి విగ్రహాల వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని, ఎక్కువ కాలం కరగకుండా నీటిలో ఉండడం వలన నీటిలో ఉన్న స్వచ్ఛత పోతుందని, నీటిలో జీవించే ప్రాణులకు హాని కలుగుతుందని, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, మట్టి గణపతిని పూజించాలని ఆయన సూచించారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడవచ్చునని ఆయన వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రంగా రెడ్డి, ఈఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బిక్షపతి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ బండి ప్రకాష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి: అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన ఎం.కవిత తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పిడి హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ముత్తారం మండలం పోతారం గ్రామానికి చెందిన గడ్డం పుష్పలత గ్రామ శివారు లోని 59వ సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమి తన కబ్జాలో ఉందని, తనకు పట్టా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అర్హత మేరకు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం, ఆగస్టు 24, 2025
కరీంనగర్: ఘనంగా గాయత్రి హోమం
కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో మంథనికి చెందిన రాంపెల్లి సత్యనారాయణ స్వగృహంలో గాయత్రి హోమం ఆదివారం నిర్వహించారు. లక్ష గాయత్రి జపం పూర్తి చేసిన సందర్భంగా హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో బ్రాహ్మణోత్తములతో నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట: పాదయాత్రను విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న టీపీసీసీ ప్రధానకార్యదర్శి శ్రీనుబాబు
వర్ధన్నపేట నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం జరగనున్న మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు పిలుపునిచ్చారు. జనహిత పాదయాత్ర సమీక్ష సమావేశంలో దుద్దిళ్ల శ్రీను బాబు. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఈ నేపథ్యంలో పాదయాత్ర విజయవంతం అయ్యే విధంగా ఏర్పాట్లపై చర్చించడానికి వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ నాగరాజుతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. సమావేశంలో పాదయాత్ర రూట్ మ్యాప్, ప్రజలతో అనుసంధానం, స్థానిక స్థాయిలో సమీకరణలు, ప్రచార కార్యక్రమాలపై చర్చించారు.
FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..
సప్తవర్ణ శోభితం
- 1. శనివారం... సాహితీ సుమాలు సాహిత్య రంగంలో ప్రముఖులు, వారి చరిత్ర, రచనలు, కవితలు,
- 2. ఆదివారం సాంస్కృతికం.. సినిమా, సంస్కృతిక రంగాల్లో లబ్ధప్రతిష్టుల గురించి వ్యాసాలు, ఇంటర్వ్యూలు
- 3. సోమవారం క్రీడా మైదానం క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వారి వివరాలు,
- 4. మంగళవారం
- 5. బుధవారం
- 6. గురువారం: ఆధ్యాత్మికం.. దేవాలయాలు, పండితులు, ప్రవచనాలు, భక్తి
- 7. శుక్రవారం.. సరస్వతీ నమస్తుభ్యం.. విద్యకు సంబంధించి ప్రముఖ కాలమిస్టుల రచనలు
విశిష్ట పోస్ట్
హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...
All time hit
-
ఆధ్యాత్మికతను సామాజిక సేవతో మేళవించిన వ్యక్తిత్వం శ్రీ సీతారామ సేవా సదన్తో సేవా ప్రస్థానం.. ...
-
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్బాబు దిక్సూచి, హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువత...
-
మంథని పట్టణంలోని పలు గణనాథులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం దర్శనం చేసుకున్నారు. 10 వ వార...
Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం





















.jpg)


























