దివంగనేత దుద్దిళ్ల శ్రీపాదరావు సహోదరి కన్నుమూత
మంథని, దిక్సూచి:
మాజీ స్పీకర్, దివంగనేత దుద్దిళ్ల శ్రీపాదరావు సహోదరి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మేనత్త, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి సువర్ణ వనమాల (91) సోమవారం తెల్లవారుజామున కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఆమె అంతిమయాత్ర మంగళవారం ఉదయం 6 గంటలకు మంథనిలోని రావులచెరువు కట్ట వద్ద ఉన్న స్వగృహం నుంచి బయలుదేరి గోదావరి తీరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అభిమానులు, బంధువులు సంతాపం వ్యక్తం చేశారు.



కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి