![]() |
| ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్ |
ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
దిక్సూచి, పెద్దపల్లి, జూలై 20:
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ బి. శ్రీరాముల తో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరం రూమ్ నెంబర్ 105 లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
గోదావరిఖని కు చెందిన ఎం. శ్రీలత తనకు నర్సింగ్ రంగంలో విద్యా అర్హత అనుభవం ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ పోస్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసి తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధి సోసైటీ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు
జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామానికి చెందిన గడ్డం పద్మ, కోట ఉషశ్రీ తమ తల్లి పేరు మీద దూళికట్ట గ్రామ శివారు సర్వేనెంబర్ 591 లో ఉన్న ఎకరం 12 గుంటల భూమి తమ చెల్లెలు తమకు తెలియకుండా విక్రయించిందని ఆ పొలాలను తమ పేరు మీద విరాసత్ కింద చేయాలనే కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు
ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన తంగళ్ళ కుమారస్వామి గ్రామపంచాయతీ కార్యాలయం మిగులు పనులు, గ్రామంలో చేసిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు 2023 నుంచి పెండింగ్ ఉన్నాయని, ఆ నిధులు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పెద్దపల్లి పట్టణానికి చెందిన బొడ్డుపల్లి శ్యామల తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పిడి హౌసింగ్ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి