దిక్సూచి, మహాదేవపూర్:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, ధర్మం, సత్యం, న్యాయం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని శ్రీను బాబు అన్నారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
అనంతరం వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో శ్రీను బాబు ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టారు. దీంతో వేడుకల ప్రాంగణంలో సందడి నెలకొంది. యాదవ సంఘం ప్రతినిధులు, నాయకులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి