దిక్సూచి, బెంగళూరు:
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ కావడం సంతోషంగా ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. బెంగళూరులో జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, హజ్, వక్ఫ్ శాఖ మంత్రి యూటీ ఖాదర్, భారీ–మధ్యతరహా పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌తోనూ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై చర్చించినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమలు, మౌలిక వసతులు, వైద్య–ఆరోగ్య రంగాల్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య మరింత సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకుని, భవిష్యత్తులోనూ పరస్పర సహకారాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామని శ్రీధర్‌బాబు వెల్లడించారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి