దిక్సూచి, కాటారం: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
కాటారం మండల పరిషత్ కార్యాలయంలో కాటారం, మహాదేవపూర్, మలహర్రావు, పలిమెల మండలాలకు చెందిన 240 కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఆడపిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మి, అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి