బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
దిక్సూచి, మంథని, జూలై 5:
ఇటీవల మంథని గోదావరి నదిలో గల్లంతై మృతి చెందిన కొమురయ్య మృతదేహాన్ని తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వెలికితీసి, కుటుంబ సభ్యులకు అప్పగించిన గంగపుత్రుల సేవలను కొనియాడుతూ, ఈరోజు బెస్తపల్లి గ్రామంలో గంగపుత్రులను మరియు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా చంద్రుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రమాద సమయంలో ఏమాత్రం వెనుకాడకుండా మానవత్వంతో ముందుకు వచ్చి సేవలందించిన గంగపుత్రులు సమాజానికి ఆదర్శమని కొనియాడారు. వారి సేవా భావం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మంథని మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్, కొండ్రు లక్ష్మణ్, వార్డు సభ్యుడు కంచు మల్లేష్, తోట్ల రాజు, బొరె తిరుపతి, బొరె రాజేశం, ధర్మాజీ రాజేందర్, మహేష్, సందీప్, గుమ్మడి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి