దిక్సూచి, కరీంనగర్, జూలై, 10:
కరీంనగర్ లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం రాత్రి పరామర్శించారు.
హైదరాబాద్ లో పలు సమావేశాల్లో పాల్గొన్న మంత్రి నేరుగా కరీంనగర్ కు వచ్చి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నియోజక వర్గానికి చెందిన బాధితులను పరామర్శించి తిరిగి వెళ్లారు.
మంథని నుంచి తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండగా గాడుదల గండి గుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఖాన్సాయిపేట గ్రామానికి చెందిన కలకొండ తిరుపతిరెడ్డి, బట్టుపల్లి గ్రామానికి చెందిన ఆశా వర్కర్ ఆయిలీ రాజేశ్వరిని కరీంనగర్లోని కే.సీ. డయాగ్నస్టిక్ సెంటర్ లో పరామర్శించారు.
అలాగే..
కరీంనగర్ సన్రైజ్ హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మంథని పట్టణానికి చెందిన నల్మాస్ ప్రభాకర్ వదిన రజిత అనారోగ్యంతో ఉండగా వారిని పరామర్శించారు.
బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకునీ, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి