ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి సందర్భంగా సోమవారం మంథని పట్టణంలోని మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీపాద చౌక్ మరియు రావులచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన శ్రీపాదరావు గారి విగ్రహాలకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిల్ల శ్రీను బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శ్రీను బాబు గారు మాట్లాడుతూ, శ్రీపాదరావు గారు మంథని ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారని, వారి జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని కొనియాడారు. వారి ఆశయ సాధన దిశగా తాము కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. మంథని పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా శానిటేషన్ సిబ్బందికి చీరలు పంపిణీ చేసి వారి సేవలను అభినందించారు. అనంతరం మంథని బస్టాండ్లో మంథని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మంథని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న గారి ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు చిత్రపటానికి TPCC ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిల్ల శ్రీనుబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ మరియు మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ ఆధ్వర్యంలో 30మంది నిరుపేదలకు దుద్దిల్ల శ్రీను బాబు గారి చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీపాద రావు గారు సర్పంచ్ గా, సమితి అధ్యక్షునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభపతిగా శ్రీపాదరావు గారు మంథని ప్రాంతానికి ఎన్నో సేవలు అందించారని, రైతులకు లోన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించి,సాగునీరు అందించి రైతులకు అండగా నిలిచారని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతీ యువకులకు మంచి విద్యా ఉద్యోగం కల్పించాలని, ప్రతి మారుమూల గ్రామానికి రోడ్డు సౌకర్యం, తాగునీరు అందించడం కోసం ఎంతగానో కృషి చేశారు. శాసనసభపతిగా ఎంతో హుందాగా వ్యవహరించి శాసనసభ పదవికి వన్నెతెచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంథని పట్టణ,మండల నాయకులు, యూత్ కాంగ్రెస్,అనుబంధ సంఘాల నాయకులు, దుద్దిళ్ల కుటుంబ అభిమానులు పాల్గొన్నారు.







కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి