హైదరాబాద్ చిక్కడపల్లి లోని శ్రీ త్యాగరాయ గాన సభ లో నిర్వహించిన గ్రంథావిష్కరణ సభ కార్యక్రమంలో పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరించిన *టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు.*
*అచ్యుతన్న చారిటబుల్ ట్రస్ట్ వారి సాదర ఆహ్వానంతో నిర్వహించిన ఈ సభలో, “శ్రీ గోపాలదాస కృతిరత్నాలు”* గ్రంథాన్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శుభాశీస్సులతో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా *దుద్దిళ్ళ శ్రీను బాబు మాట్లాడుతూ,*
మొదటి ప్రచురణను 1993లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తమ తండ్రి స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు గారు ఆవిష్కరించారని గుర్తుచేశారు. రెండవ ప్రచురణ ఆవిష్కరణ తమ చేతుల మీదుగా చేపట్టే అవకాశం కల్పించిన ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆధ్యాత్మిక సాహిత్యం మన సంస్కృతి,సనాతన విలువలను తదుపరి తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గ్రంథ రచయితలకు మరియు ట్రస్ట్ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పండితులు, సాహితీవేత్తలు,భక్తులు మరియు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి