* జాతరకు కొత్త తారురోడ్లు
* ఇచ్చిన మాట తప్పేది లేదు
* భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలి
* పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి ప్రతినిధి:
పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో గురువారం సమ్మక్క, సారలమ్మల జాతర మహోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు గద్దెల పై కొలువుతీరిన వనదేవతలకు మొక్కలను చెల్లించుకున్న అనంతరం స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పడిగిద్ద రాజును దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 1 కోటి రూపాయల నిధులతో సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నూతనంగా తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అని అన్నారు. ఇచ్చిన మాట నెరవేర్చడమే తప్పా మాట తప్పేది లేదని స్పష్టం చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జాతర కమిటీ వారికి గౌరవ ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు, పలు గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు మరియు ప్రజాప్రతినిధులు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు..


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి