Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

మంగళవారం, సెప్టెంబర్ 22, 2026

వచ్చే ఏప్రిల్​ నాటికి పనులన్నీ పూర్తి చేయాలి






దిక్సూచి, కాళేశ్వరం​:

శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులతో పాటు గోదావరి పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేసి, వచ్చే ఏప్రిల్‌ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరంలోని దేవస్థానం ఈవో కార్యాలయంలో  రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం  రెవెన్యూ, పోలీస్, అటవీ,దేవాదాయ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, పీఆర్, విద్యుత్తు, ఆర్ డబ్ల్యూ ఎఎస్, ఆర్టీసీ  శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎక్కడా రాజీపడరాదని స్పష్టం చేశారు. దేవుడి నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని పుష్కరాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.

అభివృద్ధి పనులకు అవసరమైన మట్టి సేకరణతో
పాటు ఇతర అనుమతుల ప్రక్రియను అటవీ శాఖ అధికారులు సమన్వయంతో వేగవంతం చేయాలని కోరారు. పనుల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్‌ అధికారులు కాళేశ్వరంలోనే ఉంటూ పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల పురోగతిని కాటారం సబ్‌ కలెక్టర్‌ గౌరవ్‌ శర్మ ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరమైన సమన్వయం చేయాలని సూచించారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి కాళేశ్వరం క్షేత్ర ప్రాశస్త్యాన్ని మరింత పెంచాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. అంతకు ముందు ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.  అంతరం ఈఓ కార్యాలయంలో వివిధ  శాఖల ద్వారా చేపట్టనున్న పనులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో  దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, ధార్మిక సలహాదారు గోవింద హరి, అటవీశాఖ అధికారి కిష్టా గౌడ్, కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ,  అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఉపాధిహామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ దండు రమేష్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు,  దేవాలయ శిల్పి స్థపతి బాలసుబ్రహ్మణ్యం, దేవాలయ చైర్మన్ మోహన్ శర్మ, కాటారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ పంతగాని తిరుమల, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి,  దేవస్థానం డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, దేవాదాయ,  ఇరిగేషన్, పంచాయతి రాజ్, విద్యుత్, ఆర్ అండ్ బి,  ప్రణాళిక, ఆర్కి టెక్చర్ సూర్య నారాయణ మూర్తి, సర్పంచ్  మోహన్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.





















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026