* సరైన నాయకునికి మరోసారి అవకాశం
దిక్సూచి, మంథని:
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా అయిలి ప్రసాద్ రెండోసారి ఎన్నికయ్యారు, రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు ఆయనకు మరోసారి ఈ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అయిలి ప్రసాద్ పార్టీ కార్యక్రమాలను ముందుండి నిర్వహిస్తూ, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ బలోపేతానికి చేస్తున్న సేవలను అధిష్టానం గుర్తించి మరోసారి ఈ అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా అయిలి ప్రసాద్ మాట్లాడుతూ
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిల్ల శ్రీను బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై మరోసారి నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మంథని మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అయిలి ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడంతో నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి