మంథని పట్టణంలోని పెంజేరుకట్ట వీధిలోని హనుమాన్ దేవాలయంలో ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఉపాధ్యాయులను రిటైర్డ్ ఇంజనీర్, సామాజిక కార్యకర్త దహగం లింగన్న ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తున్న చిలప్పగారి సునీల్, రామడుగు శ్యామల, దహగం శ్రీలక్ష్మి, పనకంటి శ్రీకాంత్ లను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించడం మన సంప్రదాయమని ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పనకంటి చంద్రశేఖర్,
రిటైర్డ్ ఉపాధ్యాయుడు అవధాని మోహన్ శర్మ, సీనియర్ న్యాయవాది లోకే రాధాకిషన్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు లోకే మనోహర్, లోకే రమాకాంత్, దహగం శ్రీపాద్, చిలప్పగారి గణేష్, కొంతం మోహన్, పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి